జగన్ నివాసానికి 15 కోట్లు మరో వివాదంలో సీఎం జగన్

జగన్ నివాసానికి 15 కోట్లు మరో వివాదంలో సీఎం జగన్

0
34

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రూపాయ జీతం తీసుకుంటూ సౌత్ లో మరో రికార్డు క్రియేట్ చేశారు.. కాని ఆయన ఇంటికి మాత్రం ఇప్పటి వరకూ సర్కారు సొమ్ము కోట్లు ఖర్చు చేస్తున్నారు అనే విమర్శలు మాత్రం ఎదుర్కొంటున్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు చెందిన తాడేపల్లిలోని ఇళ్లు, క్యాంపు ఆఫీసుకు కొత్తగా అల్యూమినియమ్‌ కిటికీలు, తలుపులు అమర్చేందుకు రూ.73 లక్షలు మంజూరు చేస్తూ రోడ్లు భవనాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.దీంతో జగన్ నివాసం గురించి మళ్లీ చర్చ మొదలైంది.

రూపాయి జీతం తీసుకుంటూ ప్రజలకు చెప్పే ముఖ్యమంత్రి ప్రజా ధనాన్ని ఇలా ఖర్చు చేస్తారా అని విమర్శలు వస్తున్నాయి. భద్రత దృష్ట్యా కొన్ని గదులకు అల్యూమినియం తలుపులు, కిటికీలు ఏర్పాటు చే యాలని భావించారు. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గతంలో బాబు పై జగన్ ఇవే ఆరోపణలు చేశారు మళ్లీ జగన్ ఇవే ఖర్చులు చేయడం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు.

ముఖ్యమంత్రిగా జగన్‌ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఈరోజు వరకు ఆయన ఇళ్లు, దాని పరిసరాల్లో అభివృద్ధి, భద్రతా చర్యల కోసం రూ.15 కోట్లు విడుదల చేశారని తెలుగుదేశం నేతలు లెక్కలతో సహ సోషల్ మీడియాలో వెల్లడిస్తున్నారు .. దీంతో ఇది వైసీపీ నేతలకు సమాధానం చెప్పలేని ప్రశ్నగా మారిపోయింది.