NDA Alliance Meet | ఎన్డీఏ సమావేశానికి హజరవనున్న 38 పార్టీలు..?

-

మంగళవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన ఎన్డీఏ సమావేశం(NDA Alliance Meet) జరగనుంది. జరిగే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ మీట్ కి 38 పార్టీలు హాజరవుతాయని, ఇది భారీ బలప్రదర్శనగా భావించబడుతుందని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఎదుర్కోవడానికి బెంగళూరులో 26 ప్రతిపక్ష పార్టీలు సమావేశమైన నేపథ్యంలో ఈ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి శివసేన, ఎన్సీపీ అజిత్ వర్గం, పాశ్వాన్, జితన్రామ్, ఉపేంద్రసింగ్ లతో పాటు ఏపీ నుంచి జనసేన, బిహార్ నుంచి 4 పార్టీలకు ఆహ్వానం అందింది.

- Advertisement -

ఎన్డీయే కూటమి బలోపేతమే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఓబీసీ, దళిత, గిరిజన, ఆదివాసీల్లో పట్టున్న చిన్న పార్టీలతో దోస్తీ చేస్తున్నట్లు తెలుస్తోంది. సవాల్‌గా మారనున్న 2024 ఎన్నికలకు ఏడాది కంటే తక్కువ సమయం ఉండడంతో విపక్షాలు, బీజేపీ రెండూ తమ వ్యూహాన్ని చక్కదిద్దుకుంటూ మిత్రపక్షాలకు చేరువవుతున్నాయి. కాగా రేపు జరగనున్న ఎన్డీఏ సమావేశం(NDA Alliance Meet)లో పాల్గొనేందుకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఢిల్లీ చేరుకున్నారు. తిరుపతి నుంచి ప్రత్యేక విమానంలో ఆయన వెళ్లారు.

Read Also: రాంచరణ్ దంపతుల విషయంలో వేణు స్వామికి దిమ్మతిరిగే షాక్

Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...