బండి సంజయ్ కి బీజేపీ హై కమాండ్ కీలక బాధ్యతలు అప్పగించింది. జాతీయ నాయకత్వంలోకి బండిని తీసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది కాషాయ అధిష్టానం. శనివారం బీజేపీ జాతీయ కమిటీని ప్రకటించింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ ని నియమించింది. జాతీయ కార్యదర్శిగా ఏపీ నేత సత్య కుమార్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ కొనసాగనున్నారు. అయితే బండి సంజయ్ ని ఏదైనా ఒక రాష్ట్రానికి ఇంఛార్జి గా నియమించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, డీకే అరుణ ఇప్పటికే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈరోజు మధ్యాహ్నం 2గంటలకు హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా ఢిల్లీకి బయలుదేరనున్నారు. అధిష్టానం జాతీయ కమిటీని ప్రకటించిన వెంటనే వీరు ఢిల్లీకి బయలుదేరడం ఆసక్తికర చర్చగా మారింది. కాగా తెలంగాణలో ఇటీవలే అధ్యక్ష పదవి నుంచి బీజేపీ హైకమాండ్ బండి సంజయ్ ని తప్పించి కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ప్రకటించింది. ఈ క్రమంలో బండి సంజయ్ కి ఎలాంటి పదవి ఇస్తారనేది ఆసక్తికరంగా మారిన తరుణంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక, బీజేపీ కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తిని తగ్గించేందుకే సంజయ్ కి కీలక పదవి ఇచ్చినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
भाजपा राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda ने निम्नलिखित केंद्रीय पदाधिकारियों के नामों की घोषणा की है- pic.twitter.com/0aaArxHF30
— BJP (@BJP4India) July 29, 2023