ఒకప్పటి స్టార్ హీరోయిన్ శోభన(Actress Shobana) ప్రస్తుతం చెన్నైలోని శ్రీమాన్ శ్రీవాత్సవ రోడ్‌లోని ఇండిపెండెంట్ హౌజ్‌లో నివాసముంటోంది. అయితే వృద్ధురాలైన తల్లిని చూసుకునేందుకు ఓ పని మనిషిని పెట్టగా.. ఆమె ఇంట్లో రూ. 41 వేలు చోరీ చేసినట్లు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేయగా.. పని మనిషి దోషిగా గుర్తించబడింది.
- Advertisement -
అయితే ఆ తర్వాత శోభన(Actress Shobana) ఆ కంప్లయింట్‌ను వెనక్కి తీసుకుని.. ఆ వర్కర్‌కు మళ్లీ అవకాశమిస్తూ పనిలో చేర్చుకుంది. కాగా సదరు పని మనిషి ఈ దొంగిలించిన డబ్బులను డ్రైవర్ సహాయంతో కూతురి ఎకౌంట్‌కు పంపేదని తెలిసింది. ఇక ఈ డబ్బులను ప్రతీ నెల శాలరీలో కట్ చేసుకుంటానని… వెంటనే స్పందించిన పోలీసులకు థాంక్స్ చెప్పింది.