మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 14న చిల్డ్రన్స్ డే రోజున విజయవాడలో దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే… భవన నిర్మాణ కార్మికులకు అలాగే రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులకు వ్యతిరేకంగా ఆయన దీక్ష చేయబోతున్నారు…
ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా పార్టీ నేతలు శరవేగంగా చేస్తున్నారు… తాజాగా ఈ దీక్షపై మాజీ ఆర్టీసీ చైర్మన్ వర్లరామయ్య స్పందించారు… తమ పార్టీనేత చంద్రబాబు నాయుడు చేపట్టే దీక్ష జగన్ ప్రభుత్వ మెడకు చుట్టుకుంటుదని అన్నారు…
తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… భవన నిర్మాణ కార్మికులు వారికి కాలంచెల్లి చనిపోతున్నారని వైసీపీ నాయకులు అవహేళన చేస్తున్నారని అయితే వారికి ఎక్స్ గ్రేషియా ఎందుకు చెల్లిస్తున్నారని ఆయన ప్రశ్నించారు… మంత్రి బొత్స బినామీకు 50 ఇసుక లారీలు ఉన్నాయని ఆరోపించారు…