ఏపి కి హోదా కాంగ్రెస్ వల్లనే సాధ్యం

ఏపి కి హోదా కాంగ్రెస్ వల్లనే సాధ్యం

0
132

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రాన్ని విడగొట్టొద్దు, సమైక్యంగా ఉంచండి అని నినదించిన వారిలో ఆయన కూడా ఒకరు అని చెప్పుకోవాలి. సమైక్యాంధ్ర ఉద్యమాల్లో పాల్గొన్న ఆయన అంతటితో ఆగకుండా ఆ తరువాత జై సమైక్యాంధ్ర అనే పార్టీని కూడా నెలకొల్పారు. నేను కానీ ఇతర నాయకులుకాని ఎన్ని ప్రయంత్నలు చేసినప్పటికి కూడా రాష్త్ర విభజనను ఆపలేకపోయామని అయన పలుమార్లు మీడియా ముందు తన ఆవేదనను వ్యక్తం చేసారు. అయితే అయన నెలకొల్పిన జై సమైక్యాంధ్ర పార్టీ గత ఎన్నికల సమయంలో ఒక్క సీటు కూడా గెలుచుకోకుండా కనుమరుగు అయింది. ఇక ఆ తరువాత ఆయన కూడా చాలా కాలం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా వున్నారు. ఇక ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో రెండు తెలుగు రాష్ట్రాలపై దృష్టిపెట్టిన కాంగ్రెస్ ఎలాగైనా తమ పార్టీని అధికారం లోకి తేవాలన్న గట్టిపట్టుదలతో వుంది. అయితే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ,

రాహుల్ గాంధీ సహా కొందరు కాంగ్రెస్ నాయకులు ఇదివరకటి సీనియర్లను మరల తమ పార్టీలోకి తీసుకుని వారిద్వారా పార్టీకి పూర్వ ప్రతిష్టను కూడగట్టుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఇటీవల రాష్త్ర పర్యటన చేసిన ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి ఉమన్ చాందీ ఏపీ లోని జిల్లాల్లో విస్తృత పర్యటనలు జరిపి కిరణ్ సహా కొందరు సీనియర్ నాయకులతో తిరిగి పార్టీలోకి అహ్వానము పలికారు. ఇక కొద్దిరోజుల క్రితం రాహుల్ సమక్షంలో కిరణ్ మళ్లి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఏపీ విషయమైయి నేడు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నవ్యంధ్ర అన్నివిధాలా న్యాయం చేయగల పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, అందుకే అధినేత్రి సోనియా, రాహుల్ ఇతర ముఖ్య సభ్యులు ఆధార్ కలిసి మొన్న జరిగిన సిడబ్ల్యూసి సమావేశంలో రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో తాం అధికారం చేపడితే ఏపీకి ప్రత్యేక హోదా ఇచేలా తీర్మానం కూడా చేసినట్లు చెపుతున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏపీకి అన్నివిధాలా న్యాయం చేస్తామని అన్నారు.