India vs Ireland | టీమిండియా జట్టు ప్రస్తుతం ఐర్లాండ్ పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో భాగంగా ఇప్పటికే జరిగిన తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు 139పరుగులకే ఆల్ అవుట్ అయింది. దీంతో స్వల్ప లక్ష్యాన్ని ఛేదనలో టీమిండియా 47పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఉన్న దశలో వర్షం కారణంగా మ్యాచ్ నిలిచి పోయింది. దీంతో డక్‌వర్ లూయిస్ పద్ధతిలో టీమిండియా నెగ్గినా.. ఆ విజయం అభిమానులకు కొంత నిరాశను మిగిల్చింది. ఈ క్రమంలో ఐర్లాండ్‌తో ఆదివారం జరిగే రెండో టీ20లో టీమిండియా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఈ సిరీస్ తర్వాత ఆసియాకప్, వన్డే ప్రపంచకప్‌ల ముందు బుమ్రాకు ఈ సిరీస్ మ్యాచ్ ప్రాక్టీస్‌గా ఉపయోగపడనుంది.
India vs Ireland జట్లు(అంచనా)..
భారత్: బుమ్రా(కెప్టెన్), గైక్వాడ్, జైస్వాల్, సంజు(వికెట్‌కీపర్), తిలక్ వర్మ, రింకూ సింగ్, దూబే, సుందర్, ఆర్ష్‌దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, బిష్ణోయ్.
ఐర్లాండ్: స్టెర్లింగ్(కెప్టెన్), బల్‌బిర్నీ, టక్కర్(వికెట్ కీపర్), హారీ టక్కర్, గరెత్ డెలానీ, ఛాపర్, డోక్రెల్, అడైర్, మెక్ కర్టీ, జోషూ లిట్టిల్, క్రెగ్ యంగ్/వోక్రోమ్.