ప్రేమ, పెళ్లి పేరుతో జబర్దస్త్ ఆర్టిస్ట్ తనను మోసం చేశాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే జబర్దస్త్ ఆర్టిస్ట్, సింగర్ నవ సందీప్(Nava Sandeep)పై కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను మోసం చేశాడని ఆరోపించింది. పెళ్లి చేసుకోమని అడిగితే తప్పించుకు తిరుగుతున్నాడని బాధిత యువతి పేర్కొంది. యువతి ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా అర్టిస్ట్ నవ సందీఫ్ జబర్దస్త్ షోతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, పటాస్ వంటి తదితర షోలలనూ కనిపిస్తాడు. జబర్థస్త్‌లో కామెడీ పండించి నవ్వించిన సందీప్ ఇలా ఒక అమ్మాయిని మోసం చేశాడని తెలిసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.