ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అధికార వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మరోసారి రెచ్చిపోయారు… గతంలో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును అడ్డుకోవడానికి అనేక మందితో కేసులు వేయించి భూసేకరణను చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారని మండిపడ్డారు.
అయితే అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోర్టులతో పోరాడి 90 శాతం పూర్తి చేశారని గుర్తు చేశారు విజయసాయిరెడ్డి. 430 ఏళ్ల హైదరాబాద్ తో పాటు ORR ను తనే నిర్మించానని ఇప్పుడు చంద్రబాబు కోతలు కొస్తున్నాడని మండిపడ్డారు.
రాష్ట్రాన్ని 2.60 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టి వెళ్లారని ఆయన తీవ్రస్ధాయిలో ఆరోపించారు. సిఎంగా ఉన్నన్నాళ్లు ప్రతి నెలా RBIమెట్ల వద్ద ఓవర్ డ్రాఫ్టు కోసం బొచ్చె పట్టుకుని నిల్చునేవారిని ఎద్దేవా చేశారు. 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యమేనని ప్రధానికి పాఠాలు చెబ్తాడట ఈ నారా అమార్త్యా సేన్ అని మండిపడ్డారు…