శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. IRCTC ప్యాకేజీతో ఈజీగా దర్శనం

-

IRCTC Package | తిరుమల వెళ్లి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని భక్తులు ఎంతగానో పరితపిస్తుంటారు. కుదిరినప్పుడల్లా తిరుమలకు పయనించాలని అనుకుంటారు. కానీ ట్రైన్ టికెట్లు, దర్శన టికెట్లు దొరక్క ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇలాంటి భక్తులను దృష్టిలో పెట్టుకుని ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(IRCTC)సంస్థ కొత్త ప్యాకేజీ తీసుకువచ్చింది. తిరుమలతో పాటు కాణిపాకం, తిరుచానూరు, శ్రీనివాస మంగాపురం, శ్రీకాళహస్తి ఆలయాలు కూడా సందర్శించుకోవచ్చు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక రైలు ప్రతి శుక్రవారం విశాఖపట్నం నుంచి బయలుదేరుతుంది.

- Advertisement -

విశాఖపట్నం, అన్నవరం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఈ రైలు ఎక్కొచ్చు. మూడు రాత్రులు, నాలుగు పగళ్లు ఈ టూర్ ఉంటుంది. ఆగస్ట్ 18, 25, సెప్టెంబర్ 1,8,15,22 తేదీల్లో ప్రయాణాలకు టికెట్లు ఇప్పటికే బుక్ అయ్యాయి. సెప్టెంబర్ 29 తర్వాత నుంచి టికెట్లు అందుబాటులో ఉన్నాయి. మొదటిరోజు విశాఖపట్నంలో శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు తిరుమల ఎక్స్‌ప్రెస్‌ రైలు బయలుదేరి.. రెండవ రోజు శనివారం ఉదయం తిరుపతి రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది. అనంతరం అక్కడ నుంచి హోటల్‌కు వెళ్లి అల్పాహారం తర్వాత కాణిపాకం, శ్రీనివాస మంగాపురం తీసుకువెళ్తారు. అక్కడ దర్శనం అనంతరం రాత్రికి హోటల్‌లో బస ఉంటుంది. తర్వాతి రోజు ఉదయం తిరుచానూరు, శ్రీకాళహస్తితో పాటు తిరుమలకు తీసుకువెళ్లి దర్శనం చేయిస్తుంటారు. ఇందుకోసం IRCTC ప్రత్యేక దర్శన టికెట్లు ఏర్పాటు చేస్తుంది.

IRCTC Package | దర్శనం పూర్తయ్యాక రాత్రి 8:30 గంటలకు తిరుపతి స్టేషన్‌లో బయలుదేరి నాలుగో రోజు ఉదయం 11:30 గంటలకు విశాఖ రైల్వే స్టేషన్ చేరుకోవటంతో యాత్ర పూర్తవుతుంది. టూర్ ప్యాకేజీలో భాగంగా దర్శనం టికెట్లు, ఏసీ రూంలో బస, ఏసీ బస్సు, ఉదయం టిఫిన్, రాత్రి భోజనం, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటివి కవర్ అవుతాయి. అయితే పర్యటక ప్రదేశంలో ఎక్కడైనా రుసుములు ఉంటే అది మాత్రం మీరు చూసుకోవాలి. దర్శనం కోసం స్త్రీ, పురుషులు సంప్రదాయ దుస్తులే ధరించాలి. ప్యాకేజీ పూర్తి వివరాల కోసం www.irctctourism.com వెబ్‌సైట్ సందర్శించిండి.

Read Also: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నెలకు రూ.లక్షా 40వేల జీతంతో ఉద్యోగాలు
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

High BP | హైబీపీ రాకూడదంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..

ప్రస్తుత పోటీ ప్రపంచంలో చిన్న వయసులోనే అనేక రకాల రుగ్మతలు వస్తున్నాయి....

Director Shankar | నెగిటివ్ రివ్యూలకే అవే సమాధానం చెప్తాయి: శంకర్

సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్(Director Shankar) ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా పనుల్లో...