వైసీపీ రహస్యాన్ని బయట పెట్టిన టీడీపీ

వైసీపీ రహస్యాన్ని బయట పెట్టిన టీడీపీ

0
128

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఏ భూమి ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడటం లేదా అంటే అవుననే అంటున్నారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు…

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీడీపీ హయాంలో ప్రజా ఆస్తులు భద్రతగా ఉండేవని కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ప్రభుత్వ కార్యాలయాలు అమ్మకం కూడా చూడాల్సి వస్తుందేమోనని యనమల అనుమానం వ్యక్తం చేశారు… అది కూడా కేవలం వైసీపీ కార్యకర్తలకే దక్కుతాయని ఆయన తెలిపారు…

అధికారంలోకి వచ్చిన తర్వాత సర్కార్ భూములను చౌకగా అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు…. ప్రభుత్వ భూములను చూస్తుంటే నవరత్నాల అమలులో వైసీపీ ప్రభుత్వం విఫలమైనట్లు స్పష్టమవుతోందని తెలిపారు… ప్రభుత్వం ఉన్నది ప్రజా ఆస్తులను కాపాడేందుకు ఉందని అన్నారు…