రూ.2,000 నోట్ల మార్పిడికి ఈరోజే లాస్ట్ డేట్.. మార్చకపోతే పనికిరావా?

-

రూ.2,000 నోట్ల(2000 Rupees Note) మార్పిడి, బ్యాంకుల్లో డిపాజిట్ కు ఆర్బీఐ విధించిన గడువు ఈరోజుతో ముగియనుంది. ఈ వ్యవధిని అక్టోబరు 31 వరకూ పొడిగించే అవకాశాలున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్ బీఐ)లోని ఉన్నత స్థాయి వర్గాలు చెబుతున్నట్లు కొన్ని వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా ప్రవాస భారతీయులను దృష్టిలో పెట్టుకొని ఈ వెసులుబాటు కల్పించే అవకాశం ఉందని చెబుతున్నాయి. ఈ ఏడాది మే 19న రూ.2,000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఈ నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసుకోవాలని లేదా మార్చుకోవాలని సూచించింది. దీనికోసం సెప్టెంబరు 30 చివరి తేదీగా ప్రకటించింది. ఈ నెల 1న ఆర్బీఐ విడుదల చేసిన ప్రకటనలో 93 శాతం రూ.2,000 నోట్లు మార్కెట్లో నుంచి వెనక్కి వచ్చాయని తెలిపింది. వీటి విలువ రూ.3.32 లక్షల కోట్లని పేర్కొంది. ఇంకా రూ. 24,000 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు వెనక్కి రావాల్సి ఉందని తెలిపింది. వచ్చిన నోట్లలో 87 శాతం డిపాజిట్ల రూపంలో ఉండగా, మిగతా 13 శాతం వరకూ మార్పిడి చేసుకున్నట్లు పేర్కొంది.

- Advertisement -

గడువు పెంచుతారా?

ఆర్బీఐ విధించిన గడువు తీరనున్న నేపథ్యంలో గడువు పెంచుతుందా? లేదా? అనేది ఇప్పుడు చర్చగా మారింది. కొన్ని బ్యాంకుల్లోకి రూ.2,000 నోట్లు(2000 Rupees Note) రావడం పూర్తిగా ఆగిపోయినట్లు బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబరు 1 నాటికి రూ.24,000 కోట్ల మేరకు ఉన్నప్పటికీ.. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎన్ని నోట్లు వెనక్కి వచ్చాయన్న విషయంపై ఆర్బీఐ ప్రకటన లేదు. ఈ నేపథ్యంలో స్వల్ప మొత్తంలో మాత్రమే నోట్లు మార్కెట్లో ఉండే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. గడువు పెంపుపై చివరి రోజైన నేడు ఆర్బీఐ నుంచి స్పష్టత వస్తుందా అనేది చూడాలని అంటున్నారు.

మార్చుకోకపోతే పనికిరావా?

అనివార్య కారణాల వల్ల గడువు తీరే లోపు మార్చుకోకపోతే ఏం జరుగుతుందనే సందేహం చాలామందికి ఉంది. ప్రస్తుతం ఉన్న వివరాల ప్రకారం దీనికి ఆర్బీఐ ఎలాంటి ప్రత్యామ్నాయం చెప్పలేదు. ఇంకా రావాల్సిన నోట్ల ఆధారంగా ఆర్బీఐ ఏదైనా ప్రకటన చేస్తుందా అన్నది వేచి చూడాల్సిందే.

Read Also: లా కమిషన్ నయా ఫార్ములా.. 2029 నుంచి జమిలి ఎన్నికలు!!
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Group 1 Mains: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్...

AP Cabinet: కూటమి ప్రభుత్వంలో కొత్త ఎమ్మెల్యేలకు బంపర్ ఆఫర్ 

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం నేడు (బుధవారం) కొలువుదీరనుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి...