గంటా విషయంలో తన మనసులో మాట చెప్పిన జగన్

గంటా విషయంలో తన మనసులో మాట చెప్పిన జగన్

0
72

తెలుగుదేశం పార్టీలో చక్రం తిప్పిన నేతలు ఇప్పుడు ఇంట్లోనే కూర్చున్నారు.. వీరందరూ రాజకీయంగా చాలా సైలెంట్ అయ్యారు ..నారాయణ లాంటి మాజీ మంత్రి అయితే తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు.. తన కార్పొరేట్ స్కూళ్లు కాలేజీలు ఏమవుతాయో అనే బెంగ కూడా ఉండే ఉండవచ్చు, ఇక తెలుగుదేశం ఎమ్మెల్యే శ్రీనివాసరావుని వైసీపీలోకి చేర్చుకోవడానికి ముందు మంతనాలు జరిపారు అని వార్తలు వచ్చాయి.. అయితే తర్వాత వైసీపీ నేతలు దీనిని నిర్ధారించలేదు. దీంతో గంటా వైసీపీ కాదు బీజేపీ అని తేల్చుకున్నారు.

అయితే గంటా వైసీపీలో చేరితే జగన్ కు ప్లస్ అవ్వడం ఎలా ఉన్నా ఆయనకు మైనస్ అవుతుంది అని తెలుస్తోంది. అందుకే గంటాకి వైసీపీ ఆహ్వనం అందలేదట. విశాఖ భూ వ్యవహరంలో సిట్ విచారణలో గంటాకు ఎదురు దెబ్బలు తప్పవు అంటున్నారు, అలాగే ఉత్తరాంధ్రాలో కచ్చితంగా తన హవా చూపిస్తాడు.. ఇప్పటి వరకూ వైసీపీకి సేవ చేసిన వారికి హస్తం ఇచ్చినట్లు అవుతుంది. అందుకే గంటా మనపార్టీలోకి వస్తే.. వచ్చే లాభం కంటే నష్టం ఎక్కువ అని జగన్ సైలెంట్ అయ్యారట , పైగా మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా గంటా చేరికని వ్యతిరరేకించారు అని తెలుస్తోంది.