అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి(Vivek Venkataswamy) రాజీనామా చేశారు. ఆయనతోపాటు కుమారుడు వంశీ కూడా గుడ్ బై చెప్పేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆయన పార్టీలో చేరినట్లు తెలుస్తోంది. వివేక్ చేరితే పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో పార్టీ బలోపేతం అవుతుందని ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపునకు ఆయన సహకరిస్తారని కాంగ్రెస్ పార్టీ కూడా ఓకే చెప్పింది.
కేంద్ర మాజీమంత్రి జి.వెంకటస్వామి రాజకీయ వారసుడిగా రాజకీయాల్లో వచ్చిన వివేక్(Vivek Venkataswamy) 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దపల్లి ఎంపీగా గెలిచారు. 2014 ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరి ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. అయితే బీఆర్‌ఎస్‌లో ప్రాధాన్యత లేదని భావించిన ఆయన బీజేపీలో చేరారు. ఐదేళ్లుగా బీజేపీలో ఉన్నా సరైన ప్రాధాన్యం దక్కలేదన్న ఆవేదనతో తిరిగి కాంగ్రెస్‌కు దగ్గరయ్యారు.
Read Also: ఉండవల్లి చేరుకుని ఎమోషనల్ అయిన చంద్రబాబు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat