టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్ అదనపు షరతులపై ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడించింది. స్కిల్ కేసు(Skill Development Case)కు సంబంధించి మీడియాతో మాట్లాడవద్దని, రాజకీయ ర్యాలీలో పాల్గొనవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. కానీ చంద్రబాబు కార్యక్రమాల పరిశీలనకు ఇద్దరు డీఎస్పీలను పెట్టాలన్న సీఐడీ(CID) అభ్యర్థనను మాత్రం తిరస్కరించింది. సీఐడీ పిటిషన్‌పై బుధవారం ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం నేడు తీర్పు వెలువరించింది. మధ్యంతర బెయిల్ షరతులతో పాటు మరికొన్ని షరతులు విధించాలని సీఐడీ అధికారులు పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
Skill Development Case | ఇక వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌లోని ఏఐజీ(AIG) ఆసుపత్రిలో చేరిన చంద్రబాబు డిశ్చార్జ్ అయ్యారు. అక్కడి నుంచి నేరుగా జూబ్లీహిల్స్‌లోని ఎల్వీప్రసాద్ ఆసుపత్రికి వెళ్లిన ఆయన కంటికి క్యాటరాక్ట్ శస్త్రచికిత్స చేయించుకోనున్నారు. ఏఐజీ ఆసుపత్రిలో గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణులు జనరల్ మెడిసిన్‌తో పాటు కార్డియాలజీ, పల్మనాలజీ, డెర్మటాలజీ విభాగాల నిపుణుల బృందం చంద్రబాబు(Chandrababu)ను పరీక్షించి వివిధ పరీక్షలు సూచించింది. రక్త, మూత్ర పరీక్షలు, ఈసీజీ, 2డీఎకో, కాలేయ, మూత్రపిండాల పనితీరు, అలర్జీ స్క్రీనింగ్ ఇతర టెస్టులు చేశారు.