‘యానిమల్’ నుంచి ‘నాన్న నువ్ నా ప్రాణం’ పాట విడుదల

-

స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్‌(Ranbir Kapoor), సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబోలో వస్తున్న ‘యానిమల్(Animal Movie)’ చిత్రం నుంచి ‘నాన్న నువ్ నా ప్రాణం’ అంటూ సాగే లిరికల్ పాటను మేకర్స్ విడుదల చేశారు. తండ్రీకొడుకులైన అనిల్ కపూర్‌-రణ్‌బీర్‌ కపూర్‌ మధ్య వచ్చే సన్నివేశాలతో భావోద్వేగంతో ఈ పాటను తెరకెక్కించారు. అనంత్ శ్రీరామ్‌ రాసిన ఈ పాటను సోను నిగమ్‌ ఆలపించగా.. హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతం అందించాడు. తండ్రీకొడుకుల ప్రయాణం నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రం ఉండబోతున్నట్టు బీటౌన్ వర్గాలు చెబుతున్నాయి.

- Advertisement -

ఇప్పటికే ఈ మూవీ(Animal Movie) నుంచి విడుదలైన ‘అమ్మాయీ..’, ‘నే వేరే..’ అంటూ సాగే రెండు పాటలు.. పోస్టర్లు, సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రాన్ని భద్రకాళి పిక్చర్స్‌, టీ సిరీస్‌ సంస్థలపై భూషణ్ కుమార్‌, ప్రణయ్‌ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, శక్తి కపూర్, పృథ్వీ, తదితరులు నటిస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Read Also: కుక్క కరిస్తే రూ.10వేలు పరహారం.. ఎక్కడో తెలుసా..?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...