Liquor Shops | మరికొద్ది గంటల్లో తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. 119 నియోజకవర్గాల్లో ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఫలితాలపై నేతలతో పాటు ప్రజల్లో నరాలు తెగే ఉత్కంఠ సాగుతోంది. మరోవైపు కౌంటింగ్ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులు మూసివేయాలని నిర్వాహకులకు నోటీసులు జారీ చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
విజయోత్సవ ర్యాలీల్లో ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకుండా రేపు ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు వైన్స్, బార్లు, క్లబ్బులు(Liquor Shops) మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా పోలింగ్ సందర్భంగా కూడా నవంబర్ 28 నుంచి 30 సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివేసిన సంగతి తెలిసిందే.