యూ ట్యూబ్ కొత్త రూల్స్ తప్పక తెలుసుకోండి కొత్త ఛానల్స్ కు చుక్కలే

యూ ట్యూబ్ కొత్త రూల్స్ తప్పక తెలుసుకోండి కొత్త ఛానల్స్ కు చుక్కలే

0
114

డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో యూ ట్యూబ్ ప్రపంచంలో సంచలనం క్రియేట్ చేసింది. యూ ట్యూబర్ అనే పేరుతో కోట్ల రూపాయలు సంపాదించే వారు ఉన్నారు, సొంతంగా ఛానల్ పెట్టి క్రియేటీవ్ ప్రపంచంలో తన సత్తా చాటుతున్న వారు ఉన్నారు, వారి కోరిక తీరుతూనే ఆదాయం కూడా ఎర్న్ చేస్తున్నారు. అలాంటి వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ యూజర్లకు షాక్ ఇవ్వబోతోంది. అవును తాజాగా యూ ట్యూబ్ యాజమాన్యం సరికొత్త రూల్స్ తీసుకువచ్చింది

మరి కొత్త ఛానల్ పెట్టాలి అని అనుకునేవారికి ఇది పెద్ద షాక్ వార్త అనే చెప్పాలి.

1..మీరు పెట్టే వీడియోలకు తక్కువ రెవెన్యూ వస్తున్నా లేదా మీరు రోజుఇక రెండు లేదా మూడు వీడియోలు పెడుతున్నా వాటికి పెద్ద వ్యూస్ లేకపోయినా అలాంటి ఛానల్స్ వీడియోలని తీసేయాలని యూ ట్యూబ్ భావిస్తోంది

2. యూజర్కు సంబంధించిన గూగుల్ డేటాను కూడా తొలగించనున్నారు. అంటే జీమెయిల్, గూగుల్ డాక్స్, గూగుల్ ఫొటోస్ తదితర సర్వీసులను కూడా వాడుకోకుండా నిషేధం విధించనున్నారు. 2019 డిసెంబర్ 10 నుంచి ఈ ప్రక్రియ మొదలుకానుంది.

3. అయితే యూ ట్యూబ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం కూడా ఉంది…వరల్డ్ వైడ్ 200 కోట్ల మందికి పైగా యూజర్లను కలిగివున్న సంస్థ యూట్యూబ్, నిమిషానికి కొన్ని వేల వీడియోలు యూట్యూబ్లో అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఐతే… ఈ వీడియోల్లో చాలా వాటికి… యాడ్ రెవెన్యూ మాత్రం రావడం లేదు. ఇలాంటి వీడియోల వల్ల యూట్యూబ్ సర్వర్లకు అనవసరంగా స్పేస్ వృధా అవుతుంది.

5అందుకే వారి ఖర్చులు కూడా తగ్గించుకునేందుకు యూ ట్యూబ్ ఈ నిర్ణయం తీసుకుంది… ఈ డెసిషన్ వల్ల చాలా ఛానెల్స్ క్లోజ్ అవుతాయి, దీని వల్ల పాత వీడియో కంటెంట్ మరింత మందికి చేరుతుంది, అయితే కొత్త ఛానల్ కు మాత్రం ఇది ఎదురు దెబ్బే అని చెప్పాలి.