Suresh Kondeti | టాలీవుడ్ ప్రెస్ మీట్లకు బ్యాన్ చేయడంపై స్పందించిన సురేష్ కొండేటి

-

సురేష్ కొండేటి(Suresh Kondeti).. ఈయన గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, నటుడు. 2002 లో సంతోషం సినీ వారపత్రికను స్థాపించారు. ఈ పత్రిక ఆధ్వర్యంలో ప్రతి ఏటా సంతోషం ఫిలిం అవార్డ్స్ ఫంక్షన్ కూడా నిర్వహిస్తుంటారు. దీంతో సినీ ప్రముఖులకు మరింత దగ్గరయ్యారు సురేష్ కొండేటి. అయితే ఆయనకున్న చొరవతో సినిమా ప్రెస్ మీట్లలో సెలబ్రిటీలకు చిక్కు ప్రశ్నలు వేసి ఇరుకున పెడుతుంటారు. అయితే అదే రీతిలో సెలబ్రిటీలు కూడా ఆయనకి కౌంటర్స్ వేస్తుంటారు.

- Advertisement -

సబ్జెక్ట్ తో సంబంధం లేకుండా ఈయన ప్రశ్నలకి చాలామందికి ఆగ్రహం కూడా తెప్పించాయి. ఇలా సినిమా పబ్లిసిటీ కంటే ఆయన వీడియోలే ఎక్కువ వైరల్ అయ్యాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఆయన ఇదంతా పబ్లిసిటీ కోసం చేస్తున్నారని కొంతమంది నెటిజన్లు కూడా భావిస్తుంటారు. అయితే కొద్దిరోజులుగా సురేష్ కొండేటి(Suresh Kondeti) సినిమా ప్రెస్ మీట్లలో కనిపించడం లేదు. దీంతో ఆయన్ని తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్(TFJA) తాత్కాలికంగా ప్రెస్ మీట్లకు బ్యాన్ చేసిందనే వార్త గుప్పుమంది. గత కొంతకాలంగా ఆయన ప్రెస్ మీట్లలో కనిపించకపోవడంతో ఈ వార్త నిజమే అని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ప్రచారం అవుతోన్న వార్తల్లో నిజం లేదంటూ సురేష్ కొండేటి స్పందించారు. ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇస్తూ ఓ పోస్ట్ పెట్టారు. “Some People Spreading false information about Banning Suresh kondeti (my self) from Tollywood press meets. Those news are utterly false, I was on a devotional trip. I will come back with a Bang. Being a journalist for 31 years, I will be happy to serve Tollywood as usual. నన్ను తెలుగు సినీ ప్రెస్ మీట్స్ కు హాజరు కాకుండా బ్యాన్ చేసినట్టు కొందరు తప్పుడు వార్తలు సృష్టించారు. నన్ను ఎవరో బ్యాన్ చేయలేదు, ప్రస్తుతం ఒక డివోషనల్ ట్రిప్ లో ఉన్నా.. మళ్ళీ హ్యాపీగా ప్రెస్ మీట్స్ కి వస్తా. 31 ఏళ్ల నుంచి జర్నలిస్టుగా ఉన్నా ఇక ముందూ ఉంటా. మీసురేష్ కొండేటి” అంటూ ట్వీట్ చేశారు.

Read Also: డైట్ లో ఉన్నవారికి కొవ్వు లేని బెస్ట్ చిరుతిళ్ళు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...