ముంబయి ఇండియన్స్(Mumbai Indians) కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్య(Hardik Pandya)ను మేనెజ్‌మెంట్ నియమించింది. ట్రేడింగ్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్ సారథిగా ఉన్న హార్దిక్‌ను భారీ మొత్తం వెచ్చించి మరీ దక్కించుకున్న ముంబయి ఇప్పుడు నాయకత్వ బాధ్యతలను కూడా అప్పగించింది. ఈ క్రమంలో రోహిత్(Rohit Sharma) కెప్టెన్సీపై ఎంఐ స్పెషల్ ట్వీట్ చేసింది.
‘‘రోహిత్.. 2013లో నువ్వు ముంబయి ఇండియన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించావు. అప్పుడు మేనేజ్‌మెంట్‌ను ఒకటే అడిగావు. ‘మా మీద నమ్మకం ఉంచండి. గెలుపైనా.. ఓటమైనా సరే నవ్వుతూ ఉండాలి’ అని చెప్పావు. పదేళ్ల కెప్టెన్సీ కెరీర్‌లో మొత్తం ఆరు ట్రోఫీలు సాధించావు. దిగ్గజాల నాయకత్వ వారసత్వాన్ని కొనసాగిస్తూ జట్టును ముందుండి నడిపించావు. ధన్యవాదాలు.. కెప్టెన్ రోహిత్ శర్మ’’ అని ట్వీట్ చేసింది.
మరోవైపు ముంబయి(Mumbai Indians) కెప్టెన్‌గా రోహిత్ శర్మ అందించిన సేవలను కొనియాడుతూ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) కూడా ‘ఎక్స్’ వేదికగా స్పందించింది. ‘‘2013 నుంచి 2023.. దశాబ్దకాలంపాటు ఎన్నో సవాళ్లకు స్ఫూర్తిగా నిలిచావు. రోహిత్.. మీ మీద చాలా గౌరవం ఉంది’’ అనే క్యాప్షన్‌తో ధోనీ-రోహిత్ ఫొటోను సీఎస్‌కే షేర్ చేసింది.
ఇదిలా ఉంటే ఉన్నట్టుండి రోహిత్ శర్మను కెప్టెన్సీగా తొలగించడంపై హిట్‌మ్యాన్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎంతగా ఉంటే ఆ జట్టు అధికారిక అకౌంట్‌ను ట్విట్టర్‌లో 4 లక్షల మందికి పైగా, ఇన్‌స్టాలో 2లక్షల మందికి పైగా అన్‌ఫాలో చేశారు. దీంతో ముంబయి బ్రాండ్ వాల్యూ కూడా పడిపోయే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు.