Balakrishna | ఎన్టీఆర్‌ ఘాట్ వద్ద నివాళులర్పించిన బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్

-

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు. ముందుగా ఇవాళ తెల్లవారుజామున ఎన్టీఆర్ ఘాట్ వద్దకు ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR), కల్యాణ్‌ రామ్(Kalyan Ram) చేరుకుని నివాళులర్పించారు. అనంతరం నందమూరి బాలకృష్ణ(Balakrishna) ఎన్టీఆర్ ఘాట్ వద్దకు కుటుంబసభ్యులు నందమూరి రామకృష్ణ, సుహాసిని తదితరులతో చేరుకుని అంజలి ఘటించారు.

- Advertisement -

ఈ సందర్భంగా బాలకృష్ణ(Balakrishna) మీడియాతో మాట్లాడుతూ “ఒక పరమార్థం కోసం, సమాజాన్ని ఉద్ధరించడం కోసం కొందరు పుడతారు.. వారికి మరణం ఉండదు.. అలాంటి వ్యక్తుల్లో ఎన్టీఆర్ ఒకరు.. ఆయన జీవన విధానమే భగవంతుడి మార్గం. మహనీయమైన జన్మను పొందిన ఎన్టీఆర్‌కు మరణం లేదు. నటుడిగా అనితరసాధ్యమైన ఎన్నో పాత్రలను పోషించారు. అలాంటి నటధీరుడు ఎక్కడా కానరాడు. సినిమాలే కాకుండా.. బడుగు, బలహీన వర్గాల కోసం టీడీపీని స్థాపించి, ప్రతి తెలుగు బిడ్డకు రాజకీయాలంటే ఏమిటో నేర్పిన మహానాయకుడు.

Jr.NTR

ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ఇప్పటికీ ఎందరో అమలు చేస్తున్నారు. ప్రజలకు అన్నం పెట్టిన నాన్న, ఆడపడుచులకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించిన అన్న, యువత జీవితాలలో వెలుగులు నింపిన నాన్న ఎన్టీఆర్.. తెలంగాణలో పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం, తాలూకాలను మండలాలుగా చేయడం, సహకార వ్యవస్థ ద్వారా రైతులకు మేలు చేయడం, మహిళా విశ్వవిద్యాలయం, గురుకుల విద్యా విధానం, సంక్షేమ హాస్టళ్లు, జోగిని, దేవదాసి వ్యవస్థలను రద్దు చేయడం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి” అని తెలిపారు.

Read Also: ఈ ఫుడ్స్ ఏ టైమ్ లో తీసుకుంటే ఆరోగ్యమో తెలుసా?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...