ప్రపంచంలోని హిందూవులందరూ ఆతృతగా ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిరం(Ayodhya Ram Mandir) ప్రాణ ప్రతిష్టాపనకి సమయం దగ్గర పడింది. రాములోరికి గర్భగుడిలో ప్రాణప్రతిష్ట చేసే అపురూపమైన దృశ్యాలను చూసేందుకు భక్తులు తహతహలాడుతున్నారు. ఇప్పటికే దేశ విదేశాల నుంచి ప్రముఖులతో పాటు సామాన్య ప్రజలు వివిధ మార్గాల ద్వారా అయోధ్య బాట పట్టారు. దీంతో ఆధ్యాత్మి కళ ఉట్టిపడేలా అయోధ్య నగరాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు.
Ayodhya Ram Mandir | ఈ మహోన్నత దృశ్య కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించలేని భక్తులకు పీవీఆర్ సినిమాస్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. దేశంలోని 70 ప్రధాన నగరాల్లోని 170కు పైగా తమ మల్టీప్లెక్సుల్లో రాములోరి వేడుకలను లైవ్‌లో చూపిస్తామని ప్రకటించింది. జనవరి 22 ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సిల్వర్ స్క్రీన్‌పై ఈ కార్యక్రమాన్ని భక్తులు వీక్షించవచ్చని తెలిపింది. పీవీఆర్, ఐనాక్స్ అధికారిక వెబ్ సైట్లతో పాటు మూవీ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్స్ అయిన బుక్ మై షో, పేటీఎం లలో టికెట్లు బుక్ చేసుకోవచ్చంది. అలాగే ప్రతి టిక్కెట్‌పై కూల్ డ్రింక్స్, పాప్‌కార్న్ కూడా అందిస్తున్నట్లు వెల్లడించింది.
Join us for a momentous occasion! Watch the live screening of the Ayodhya Ram Mandir Inauguration at PVR and INOX on January 22nd, 2024.
Secure your seat for this monumental event and enjoy a complimentary popcorn combo with every ticket. *T&C applies.
Book now:… pic.twitter.com/UQaWTEeFME
— P V R C i n e m a s (@_PVRCinemas) January 19, 2024