దేవినేని అవినాష్ ఈ విషయంలో ముందు ఉన్నాడు

దేవినేని అవినాష్ ఈ విషయంలో ముందు ఉన్నాడు

0
131

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలో స‌రైన స‌మ‌యంలో లేను అనే బాధ వంగ‌వీటి రాధాలో మొద‌లైంద‌ట. చంద్ర‌బాబు టీడీపీ మాట‌లు విని ఆయన టీడీపీలో చేరిపోయారు.. కాని ఇప్పుడు పరిస్దితి మొత్తం అడ్డం తిరిగింది.. జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు.. కాని ఆ సమయంలో కేవలం పార్టీ మారి విమర్శలు చేయకుండా ఉండి ఉంటే ఇప్పుడు ఆయన వైసీపీలో చేరే వారు.

కాని ఇప్పుడు ఆ పరిస్దతి లేదు .. ఎన్నికల ముందు జగన్ ని ఓడిస్తా అన్నారు. మరి జగన్ గెలిచారు.. ఈ సమయంలో తమ వైరి వర్గీయుడి కుమారుడు దేవినేని అవినాష్ రాజకీయం గా సరైన అడుగులు వేశారు అని అందరూ అంటున్నారు.

ముఖ్యంగా రాధా కూడా ఆలోచిస్తున్నారట ..ఆయన వేసిన పొలిటికల్ స్టెప్ వల్ల రాజకీయం మొత్తం తిరగపడిపోయింది. ఇప్పుడు ఆయన పార్టీలో ఉండి ఉంటే కచ్చితంగా జగన్ మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీ చేసేవారు… కాని ఆయనే పార్టీ విడిచి అలా వెళ్లిపోయారు అని విమర్శలు వచ్చాయి, మొత్తానికి దేవినేని అవినాష్ వైసీపీలో చేరి ఏకంగా ఓ సెగ్మెంట్ కు ఇంచార్జ్ అవుతున్నాడు అని అందరూ చర్చించుకుంటున్నారు.