Jani Master | జనసేన పార్టీలో చేరిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్

-

ఎన్నికల వేళ జనసేన పార్టీలో చేరికలు ఊపందుకున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు ఆ పార్టీలో చేరగా.. తాజాగా సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Jani Master), ప్రముఖ నటులు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్(Prudhvi Raj) మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్(Pawan Kalyan) సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కల్యాణ్‌ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరామని.. పార్టీ అధికారంలోకి రావడం కోసం తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.

- Advertisement -

ఇక మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ(Konathala Ramakrishna) కూడా పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. ఈనెల 27న ఆయన పార్టీలో చేరనున్నారు. అలాగే గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ సైతం పవన్‌ను కలిశారు. గూడూరు ఇంచార్జ్‌గా మేరిగ మురళీని సీఎం జగన్ నియమించడంతో.. అసంతృప్తికి గురైన వరప్రసాద్ జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే త్వరలోనే కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham), మచిలీపట్నం ఎంపీ బాలశౌరి(Balashowry) కూడా జనసేనలో చేరనున్నారు.

Read Also: బిగ్ న్యూస్: CM రేవంత్ రెడ్డి వ్యక్తిగత సమాచారం లీక్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...