H4 Visa | హెచ్-4 వీసాదారులకు అమెరికా గుడ్ న్యూస్

-

హెచ్-4 వీసాదారులకు(H4 visa) అగ్రరాజ్యం గుడ్ న్యూస్ చెప్పింది. వర్క్ ఆథరైజేషన్ బిల్ ఆమోదానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. H-1B వీసాదారుల భాగస్వాములు, 21 ఏళ్ల లోపు ఉన్న వారి పిల్లలకు H-4 వీసాలు జారీ చేస్తుంటారు. అయితే వీరు అక్కడ ఉద్యోగం చేయాలంటే కచ్చితంగా ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్, ఐ – 765 కోసం అప్లై చేసుకోవాలి. ఈ ప్రొసీజర్ అంతా పూర్తై, పర్మిషన్ వచ్చేవరకు దాదాపు సంవత్సరం పడుతుంది. ఈలోపు వచ్చిన ఉద్యోగ అవకాశం కూడా కోల్పోయే ఛాన్స్ ఉంది. ఇకపై ఆ ఇబ్బంది లేకుండా సులువుగా ఉద్యోగాలు చేసుకునేలా బైడన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

హెచ్-4 వీసాదారులు(H4 visa) ఆటోమేటిక్ గా జాబ్ పర్మిషన్స్ లభించేలా రూపొందించిన బిల్లుకి జో బైడన్ ప్రభుత్వం ఆమోదం తెలుపనుంది. ఈ మేరకు వైట్ హౌస్ కీలక ప్రకటన చేసింది. బిల్లుకు సంబంధించి సెనేట్ లో డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య అంగీకారం కుదిరినట్టు వెల్లడించింది. తాజా నిర్ణయంతో సుమారు లక్ష మందికి లబ్ధి కలిగే అవకాశం ఉంది. H-1B వీసాదారుల పిల్లలు 8 ఏళ్లపాటు H-4 వీసాను కలిగి ఉంటే.. వారి వయో పరిమితి ముగిసినప్పటికీ అమెరికాలో ఉంటూ ఉద్యోగం చేసుకునేందుకు ఈ బిల్లు వీలు కల్పించనుంది. ఈ విధానం కింద రాబోయే ఐదేళ్ల పాటు ప్రతి ఏటా 18 వేల మందికి ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డులను జారీ చేయనున్నారు. జాతీయ భద్రత ఒప్పందం పేరుతో తీసుకొస్తున్న ఈ బిల్లు అమెరికాను బలోపేతం చేయడంతోపాటు సరిహద్దులను సురక్షితంగా మారుస్తుందని దేశాధ్యక్షుడు బైడెన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Read Also: పవన్ కల్యాణ్‌ అభిమానులకు శుభవార్త.. ‘ఓజీ’ వచ్చేది అప్పుడే..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...