కేంద్ర ప్రభుత్వం దివంగత ప్రధాని పీవీ నరసింహారావు(PV Narasimha Rao)కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రకటించింది. దీనిపై తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు, ప్రజలు, దేశంలోని ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పీవీకి భారతరత్న ఇవ్వడంపై ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ సురభి వాణి(Surabhi Vani Devi) స్పందించింది. తన తండ్రికి అరుదైన గౌరవం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
సురభి వాణి(Surabhi Vani Devi) మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పీవీ నరసింహారావుకి భారతరత్న(Bharat Ratna) ప్రకటించిన రోజుని చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించొచ్చు అన్నారు. ఇది తెలుగు ప్రజలకు దక్కిన గౌరవం అని పేర్కొన్నారు. తెలుగు అకాడమీ స్థాపించి విద్యార్థులకు మేలు చేకుర్చారన్నారు. ఎన్నో ఆర్ధిక సంస్కరణలు చేసి దేశ ఆర్ధిక ప్రగతిని బలోపేతం చేయడానికి కృషి చేశారన్నారు. అలాంటి గొప్ప వ్యక్తికి భారతరత్న ప్రకటించినందుకు తెలుగువారిగా మనమందరం కేంద్ర ప్రభుత్వానికి, మోడీ(PM Modi)కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలపాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.