బాలయ్య జగన్ ని కలుస్తారా? దేని గురించి

బాలయ్య జగన్ ని కలుస్తారా? దేని గురించి

0
102

తెలుగుదేశం పార్టీ తరపున అనంతపురం జిల్లాలో కీలక నేతలు అందరూ ఓటమి పాలయ్యారు.. కాని బాలయ్య మాత్రం గెలిచారు. హిందూపురంలో ఆయన రెండోసారి మంచి మెజార్టీతో గెలిచారు. అయితే మొదటి సారి గెలిచిన సమయంలో బాలయ్య నియోజకవర్గ సమస్యలు పట్టించుకోలేదు అని విమర్శలు వచ్చాయి.. ఆయన వెంట ఉండే కొందరు నేతలపై అవినీతి ఆరోపణలు వచ్చాయి.. చివరకు అన్నీ సరిచేసుకుని ఈ ఎన్నిల్లో గెలుపొందారు నందమూరి బాలయ్య, అయితే బాలయ్య గెలిస్తే మన ఊరు ఇంకా బాగుంటుంది అని అనుకున్నారు అక్కడ ప్రజలు. కాని టీడీపీ ఓటమిపాలైంది.

దీంతో పాత పనులు ఎక్కడివి అక్కడ ఆగిపోయాయి అని తెలుస్తోంది. అందుకే బాలయ్య బాబు పై తీవ్రమైన ఒత్తిడి తీసుకువస్తున్నారట హిందూపురం ప్రజలు… అందుకే బాలయ్య ఈ పనులు పూర్తి చేయాలని నేరుగా హిందూపురం సమస్యల గురంచి సీఎం జగన్ ని కలుస్తారు అని వార్తలు వస్తున్నాయి…ఆయనకు ఈ సమస్యలపై ఓ ఫైల్ ఇవ్వనున్నారని వార్తలు వస్తున్నాయి.. మరి కొందరు మాత్రం బాలయ్య వైసీపీ నేతలను కలిసేది లేదు అని చెబుతున్నారు. మరి చూడాలి ఈ వార్తల్లో నిజమెంత ఉందో.