ఏపీ సీఎంగా జగన్ మోహన్ రెడ్డిని మరోసారి చేసుకుందామంటూ రాష్ట్ర ప్రజలకు కాపు సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) పిలుపునిచ్చారు. ఈమేరకు ఆయన బహిరంగలేఖ రాశారు.
“ఈ మధ్య జరిగిన రాజకీయ పరిణామాలు మీ అందరికి తెలుసు అని అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(YS Jagan) పిలుపు మేరకు వై.యస్.ఆర్.సి.పిలోకి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను. ఇందుకు మీ ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నాను. మరోసారి జగన్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టడానికి కృషి చేస్తాను. ఎటువంటి కోరికలు లేకుండా వారి విజయానికి పని చేయాలని నిర్ణయించాను.
జగన్ ద్వారా పేదవారికి మరెన్నో సంక్షేమ పథకాలతోపాటు, అభివృద్ధిని చేయించాలని ఆశతో ఉన్నాను. మీ బిడ్డను అయిన నేను ఎప్పుడూ తప్పు చేయలేదు. చేయను కూడా. ఈనెల 14న వై.యస్.ఆర్.సి.పిలోకి చేరనున్నాను. ఉదయం 8 గంటలకు కిర్లంపూడి నుంచి తాడేపల్లికి వెళ్లి అక్కడ జగన్ సమక్షంలో పార్టీలో చేరుతాను. కిర్లంపూడిలో బయల్దేరి ప్రత్తిపాడు, జగ్గంపేట, లాలా చెరువు, వేమగిరి, రావులపాలెం, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తాడేపల్లి చేరుకుంటాను. ఈ ప్రయాణంలో మీరు కూడా పాలుపంచుకోవడానికి రావాలని ప్రార్థిస్తున్నాను. అయితే నాతో పాటు వచ్చే వారు మీకు కావాల్సిన ఆహారం, ఇతర అవసరాలు మీ వాహనంలోనే తెచ్చుకోవాలని కోరుతున్నాను” అంటూ లేఖలో ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) వెల్లడించారు.