వైసీపీ నేతను వేట కొడవళ్లతో నరికి చంపిన టీడీపీ నాయకులు

వైసీపీ నేతను వేట కొడవళ్లతో నరికి చంపిన టీడీపీ నాయకులు

0
69

గోదావరి నీటితో ఎటు చూసినా పచ్చని పైర్లతో దర్శనం ఇచ్చే పశ్చిమగోదావరి జిల్లాలో తాజాగా రక్తపు మరకలు కనిపించాయి…. జిల్లాకు చెందిన వైసీపీ నేతను టీడీపీ నాయకులు వేట కొడవళ్లతో, రాళ్లతో దాడి చేసి అత్యంత పాషవికంగా నరికి చంపారు…

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అంబర్ పేటకు చెందిన కిశోర్ శుక్రవారం తాను కౌలుకు తీసుకున్న పంటను కోత కోయిస్తుండగా టీడీపీకి చెందిన ఐదురుగు వ్యక్తులు రాళ్లతో వేట కొడవళ్లతో దాడి చేసి పరారు అయ్యారు… దీంతో తీవ్రంగా గాయపడిన కిశోర్ ను ఏలూరు ఆసుపత్రికి తరలిస్తుండగా రోడ్డు మార్గంలో మృతి చెందాడు…

కిశోర్ కౌలు కు చేస్తున్న భూమి తగాదాల్లో ఉంది… దాసరి బుల్లేమ్మ అనే మహిళ ఈ భూమికి యజమానురాలు భర్త కుమారుడు మరణించడంతో రాజశేఖర్ అనే వ్యక్తి ఈ భూమిని విక్రయించుకున్నారు… అయితే తమదే ఈ భూమి అని టీడీపీ ఎంపీటీసీ జువ్వాస్వామి ఏసుదాసు సులేమాన్ రాజులు వేదిస్తురు… దీంతో ఈ భూమిని కౌలుకు తీసుకున్న కిశోర్ ను ఖాళీ చేయించేందుకు ప్రయాత్నాలు చేశారు… కానీ ఆయన ఖాళీ చేయకపోవడంతో వీరు అతన్ని హత్య చేశారు…