మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై పౌరసరఫరా శాఖ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యాలు చేశారు… 2014 ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత రెక్కల కష్టంతో గెలిపించుకున్న 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు సంతలో పశువుల్లా కొనుగోలు చేశారని ఆయన గుర్తు చేశారు…
- Advertisement -
అంతేకాదు వారిలో నలుగురికి మంత్రిపదవులను కూడా కట్టబెట్టారని గుర్తు చేశారు నాని…. అయితే అలాంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల గురించి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు…
ఈ విలువలు ఇప్పుడు ఏమయ్యాయని నాని ప్రశ్నించారు…. చంద్రబాబు నాయుడు తన జీవితంలో ముఖ్యమంత్రి కాలేరని అన్నారు… చివరకు ప్రతిపక్ష నేత కూడా కాలేరని అన్నారు… రాజకీయాల్లో ఆయన ఓౌట్ డేటెడ్ పొలిటీషన్ అన్నారు నాని…