హైదారాబాద్ మెట్రోకి మరో ప్రతిష్టాత్మక అవార్డు

-

హైదారాబాద్ మెట్రో(Hyderabad Metro)కి మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఇటీవల పని చేయడానికి గొప్ప ప్లేస్ గా సర్టిఫికేట్ పొందిన L&T మెట్రో రైలు (హైదరాబాద్) లిమిటెడ్ (L&TMRHL)… ఉద్యోగుల శ్రేయస్సును ప్రోత్సహించడంలో మరో అవార్డును గెలుచుకుంది. ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీలో ఎక్సలెన్స్ చూపించినందుకు రవాణా (రైల్వే) విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డును ఈ సంస్థ అందుకుంది. ఇటీవల బెంగళూరులో ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్‌పై జరిగిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ 25వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌లో ఎల్ అండ్ టీ మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ కెవిబి రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు.

- Advertisement -

ఈ విషయాన్ని భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఉదయ్ యు. లలిత్, కర్ణాటక హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రీతూ రాజ్ అవస్తి సోమవారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో తెలియజేశారు. కాగా అవార్డు రావడంపై స్పందించిన సీఈఓ మాట్లాడుతూ… “ఈ అవార్డు మా ఉద్యోగుల భద్రత, శ్రేయస్సు పట్ల మా నిబద్ధతకు నిజమైన ప్రతిబింబం. ఈ అవార్డు మాకు మరింత స్పూర్తినిస్తుంది. ఉద్యోగుల భద్రత శ్రేష్ఠత విషయంలో వెనకడుగు వేయకుండా మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మా వాటాదారులందరికీ మేము మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వారి సహకారం వల్లే హైదారాబాద్ మెట్రోకి(Hyderabad Metro) ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కించుకోగలిగాము. అని అన్నారు.

Read Also: ఈ నవరత్నాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Yoga Benefits | బద్దకాన్ని బద్దలు చేసే యోగాసానాలు

Yoga Benefits | చాలా మందికి నిద్ర లేవగానే మత్తుగా, బద్దకంగా...

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...