టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత గౌతమ్ గంభీర్(Gautam Gambhir) తొలిసారి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా 2027 వరల్డ్ కప్‌లో రోహిత్, కోహ్లీ స్థానాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏమైనా జరగొచ్చని, జట్టులో స్థానం అనేది ప్లేయర్ల ఫిట్‌నెస్, ఫామ్‌పై ఆధారపడి ఉంటుందని చెప్పాడు. ప్రస్తుతం తాను ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన జట్టును నడించడానికి వచ్చానని, టీమిండియా టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్, డబ్ల్యూటీసీ, వన్డే ప్రపంచకప్‌లలో రన్నరప్‌గా నిలిచిందని గుర్తు చేశారు గంభీర్.
‘‘జట్టులోని ప్రతి ఒక్కరితో నాకు మంచి సంబంధాలే ఉన్నాయి. బీసీసీఐ(BCCI) కార్యదర్శి జైషా నాకు బాగా తెలుసు. సోషల్ మీడియాలో చాలా విషయాలపై అనేక వ్యాఖ్యలు వస్తుంటాయి. వాటిన్నంటినీ పక్కన బెడితే మా బాధ్యతలపై దృష్టి పెడతాం. ఒక్కడు గౌతమ్ గంభీర్(Gautam Gambhir) ముఖ్యం కాదు.. టీమిండియాకే ప్రాధాన్యం. కోహ్లీ(Virat Kohli), రోహిత్(Rohit Sharma)కు ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఉంది. ఫిట్‌నెస్, ఫామ్ కాపాడుకుంటే వారు 2027 వరల్డ్ కప్‌లోనూ ఆడే ఛాన్స్ ఉంది’’ అని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.