తెలుగుదేశం పార్టీ ఓటమితో కొందరు నేతలు వెంటనే పార్టీ మారిపోతున్నారు.. అయితే ప్రతిపక్షంలో మరో ఐదు సంవత్సరాలు ఉండలేక పార్టీ జంప్ అవుతున్నారు ఈ నేతలుఅనేది మరో టాక్ , ముఖ్యంగా చంద్రబాబు సర్కారు కూలిపోవడంతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయితే వైసీపీలోకి చేరికలు భారీగా ఉంటున్న సమయంలో బీజేపీలోకి కూడా చేరికలు ఉండనున్నాయి అంటున్నారు.
తాజాగా విశాఖ నుంచి మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ మారతారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన బీజేపీలోకి వెళతారు అని వార్తలు గత నెల రోజులుగా వినిపిస్తున్నాయి. ఈ సమయంలో వల్లభనేని వంశీ ఎపిసోడ్ వచ్చింది.. అయితే తాజాగా ఆయన బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారు అని తెలుస్తోంది.
ఆయన వచ్చే వారంలో బీజేపీ గూటికి చేరనున్నారు అంటున్నారు. అయితే ఆయన చేరిక తర్వాత బీజేపీలో మార్పులు కూడా జరుగుతాయి అంటున్నారు.. పార్టీ తరపున ఆయనకు కీలక పదవి కూడా రానుందట.. అయితే ఆయనకు ఏ పదవి ఇస్తారు అనే విషయంపై అప్పుడే కమలం నేతలకు గుబులు మొదలైంది అని తెలుస్తోంది..