బాపట్ల జిల్లాలో(Bapatla District) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రేపల్లే మండలం రావి అనంతవరం వద్ద శనివారం తెల్లవారుజామున ఓ లారీ అదుపుతప్పి పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నాపరాళ్ల లోడ్‌తో లారీ మాచర్ల నుంచి రేపల్లేకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు విచారణలో గుర్తించారు.ఈ ప్రమాదంలో గాయపడినవారిని ప్రస్తుతం రేపల్లే ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.మృతులు పల్నాడు జిల్లా మాచర్లకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. లారీ డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.
కాల్వలోకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు దుర్మరణం
-