విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ(CID) అధికారులకు భారీ షాక్ తగిలింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు(IRR Case)లో టీడీపీ అధినేత చంద్రబాబుపై దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను తిరస్కరించింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం అనుమతి లేదని తెలిపింది. ఛార్జిషీట్ వేయాలంటే సెక్షన్ 19 ప్రకారం అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది. కోర్టు నిర్ణయంపై తెలుగు తమ్ముళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కక్షపూరితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి న్యాయస్థానం నిర్ణయం చెంపపెట్టు లాంటిదని చెబుతున్నారు.
కాగా గురువారం ఏసీబీ కోర్టులో ఐఆర్ఆర్ కేసు(IRR Case)కు సంబంధించి చంద్రబాబుపై సీఐడీ అధికారులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. సీఐడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌లో A1గా చంద్రబాబు, A2గా మాజీ మంత్రి నారాయణ పేర్లను జోడించింది. ఇక లోకేష్, లింగమనేని రాజశేఖర్, ఆయన సోదరడు రమేష్‌లను ముద్దాయిలుగా పేర్కొంది. సింగపూర్ ప్రభుత్వంతో గతంలో తప్పుడు ఒప్పందాలు చేసుకున్నారని వెల్లడించింది. గవర్నమెంట్ టూ గవర్నమెంట్ ఒప్పందమే జరగలేదని తెలిపింది.