2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం(Kuppam) నియోజకవర్గంలో లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంగా వ్యూహ రచించారు. ఈ మేరకు 38 మందితో కమిటీ ని నియమించింది. శాసనమండలి ఎన్నికల్లో సత్తా చాటిన కొత్త ఎమ్మెల్సీకి కమిటీ బాధ్యతలను అప్పగించింది. టీడీపీ హై కమాండ్ తీసుకున్న కీలక నిర్ణయం పెద్ద చర్చకు దారితీసింది. ఏపీలోని అన్ని సీట్లలో గెలుస్తామన్న ధీమాతో కుప్పంలో ‘వై నాట్ 175’ అనే స్లోగన్‌ను జగన్ తెరమీదికి తెచ్చారు. కుప్పం గోడలపై వైనాట్ 175 టార్గెట్ అనే రాతలు అందరినీ ఆకట్టుకునేలా చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో వైసీపీ నినాదం టీడీపీని ఉలిక్కిపడేలా చేసింది. కొత్త ఆలోచనకు అవకాశం కల్పించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు(Chandrababu)కు మెజారిటీ గణనీయంగా తగ్గడం, ఆ తరువాత జరిగిన స్థానిక సంస్థలు ఎన్నికల్లో వైసీపీ దూకుడు ప్రదర్శించడంతో టీడీపీలో కలవరం మొదలైంది. దీంతో ఈసారి వైసీపీకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా.. లక్ష ఓట్ల మెజార్టీ సాధించేలా చర్యలు ప్రారంభించారు.
Read Also: వాచ్‌మెన్‌ను మూడో ఫ్లోర్ నుంచి తోసేసిన డాన్సర్లు
Follow us on: Google News, Koo, Twitter