టీడీపీ అధినేత చంద్రబాబు, గత టీడీపీ పాలనపై మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబుకి దరిద్రం పట్టుకుందని.. ఆరిపోయే దీపంలా చంద్రబాబు రంకెలు వేస్తున్నారని వ్యాఖ్యానించారు. నాలుగు ఎమ్మెల్సీ సీట్లు గెలవగానే చంద్రబాబు(Chandrababu) ఎగిరెగిరి పడుతున్నారని విమర్శించారు. 175 స్థానాల్లో ఒంటరిగా పోటీచేసే దమ్ము లేదని చంద్రబాబు ఒప్పుకున్నారని.. సింగిల్‌గా ఎదుర్కోలేక పొత్తులు- ఎత్తులు వేస్తున్నారని ఎద్దేవా చేశారు.
వైఎస్ జగన్(Jagan)కు వణుకు పుట్టించే దమ్ము దైర్యం ఎవరికీ లేదన్నారు. చంద్రబాబు వెళ్ళమంటేనే పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఢిల్లీ వెళ్లారని, బీజేపీతో విడాకులు తీసుకురమ్మని పవన్‌ను చంద్రబాబు హస్తినకు పంపారని ఆరోపించారు. ఓట్లు చీల్చడానికి పార్టీ పెట్టినందుకు వారాహి బ్యాచ్‌కు సిగ్గు లేదా అని అంబటి రాంబాబు(Ambati Rambabu) ప్రశ్నించారు. చంద్రబాబును సీఎం చెయ్యడానికి నాదెండ్ల మనోహర్ నాయకత్వంలో పవన్ నడుస్తున్నారని అన్నారు. పవన్‌కి కావాల్సింది ప్యాకేజ్.. చంద్రబాబుకి కావాల్సింది కాపు ఓట్లు అని పేర్కొన్నారు.
Read Also: జైలు నుంచి సుఖేశ్ మరో లేఖ.. ఈసారి బీఆర్ఎస్ నేతల పేర్లు ప్రస్తావన
Follow us on: Google News, Koo, Twitter