టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)కు వైసీపీ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఉండవల్లి కరకట్టపై ఆయన గెస్ట్‌హౌస్‌ను అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. క్రిమినల్ లా అమెండ్‌మెంట్ 1944 చట్టం ప్రకారం ఆ గెస్ట్‌హౌస్‌ను అటాచ్ చేయాలని సీఐడీ ప్రభుత్వాన్ని కోరింది. దీంతో స్థానిక జడ్జికి సమాచారం ఇచ్చిన సీఐడీ అధికారులు గెస్ట్ హౌస్‌ను అటాచ్ చేశారు. మాజీ సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ తమ పదవులను దుర్వినియోగం చేసి క్విడ్‌ప్రోకు పాల్పడ్డారని సీఐడీ ఆరోపించింది. వ్యాపారి లింగమనేనికి లబ్ధి చేకూరేలా సీఆర్డీయే మాస్టర్ ప్లాన్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్లలో అవకతవకలకు పాల్పడి గెస్ట్‌హౌస్ పొందారని అభియోగం మోపింది.
గెస్ట్ హౌస్ అటాచ్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ(TDP) నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ సర్కార్ చంద్రబాబు(Chandrababu)పై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని.. ఈ విషయాన్ని న్యాయస్థానాల్లో తేల్చుకుంటామని హెచ్చరించారు. రైతులను చంద్రబాబు పరామర్శించడం, లోకేశ్(Lokesh) పాదయాత్ర 100రోజులకు చేరడం, పవన్ కల్యాణ్ పొత్తులపై క్లారిటీ ఇవ్వడం వంటి అంశాలను డైవర్ట్ చేయడానికే ప్రభుత్వం ఈ వ్యవహారం తెరపైకి తెచ్చిందని మండిపడుతున్నారు.
Read Also: అవుకు జలాశయంలో పడవ బోల్తా.. ఇద్దరు మృతి
Follow us on: Google News, Koo, Twitter