చంద్రబాబు మధ్యతంర బెయిల్ షరతులపై హైకోర్టు కీలక తీర్పు

-

టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్‌ అదనపు షరతులపై ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడించింది. స్కిల్‌ కేసు(Skill Development Case)కు సంబంధించి మీడియాతో మాట్లాడవద్దని, రాజకీయ ర్యాలీలో పాల్గొనవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. కానీ చంద్రబాబు కార్యక్రమాల పరిశీలనకు ఇద్దరు డీఎస్పీలను పెట్టాలన్న సీఐడీ(CID) అభ్యర్థనను మాత్రం తిరస్కరించింది. సీఐడీ పిటిషన్‌పై బుధవారం ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం నేడు తీర్పు వెలువరించింది. మధ్యంతర బెయిల్ షరతులతో పాటు మరికొన్ని షరతులు విధించాలని సీఐడీ అధికారులు పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Skill Development Case | ఇక వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌లోని ఏఐజీ(AIG) ఆసుపత్రిలో చేరిన చంద్రబాబు డిశ్చార్జ్ అయ్యారు. అక్కడి నుంచి నేరుగా జూబ్లీహిల్స్‌లోని ఎల్వీప్రసాద్ ఆసుపత్రికి వెళ్లిన ఆయన కంటికి క్యాటరాక్ట్‌ శస్త్రచికిత్స చేయించుకోనున్నారు. ఏఐజీ ఆసుపత్రిలో గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణులు జనరల్ మెడిసిన్‌తో పాటు కార్డియాలజీ, పల్మనాలజీ, డెర్మటాలజీ విభాగాల నిపుణుల బృందం చంద్రబాబు(Chandrababu)ను పరీక్షించి వివిధ పరీక్షలు సూచించింది. రక్త, మూత్ర పరీక్షలు, ఈసీజీ, 2డీఎకో, కాలేయ, మూత్రపిండాల పనితీరు, అలర్జీ స్క్రీనింగ్ ఇతర టెస్టులు చేశారు.

Read Also: అలోవెరా ని ఇలా కూడా ఉపయోగించవచ్చు అని తెలుసా?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...