Ap Pending Issues Key Meeting: నేడు కేంద్ర, రాష్ట్ర సమన్వయ కమిటీ కీలక సమావేశం

-

Ap Pending Issues Key Meeting On Today: రాష్ట్రానికి సంబంధించి వివిధ మంత్రిత్వ శాఖల వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాల పరిష్కారానికి ఏర్పాటైన కేంద్ర, రాష్ట్ర సమన్వయ కమిటీ నేడు సమావేశం కానుంది. తొలిసారిగా కేంద్ర క్యాబినెట్‌ సెక్రటేరియట్‌ రాష్ట్ర విభజన హామీలు, నెరవేర్చిన అంశాలు, పెండింగ్‌లో ఉన్న వాటిపై సమీక్ష నిర్వహించనున్నారు. క్యాబినెట్‌ సచివాలయంలో కేంద్ర రాష్ట్ర సమన్వయ కార్యదర్శి నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన మెుత్తం 34 పెండింగ్‌ అంశాలను కేంద్ర క్యాబినెట్‌ సెక్రటేరియట్‌ అజెండాలో చేర్చింది. కాగా, కేంద్రం నుంచి పెండింగ్‌లో ఉన్న అంశాల జాబితాను.. ఈనెల మెుదటి వారంలోనే అందించాలని ఏపీని క్యాబినెట్‌ సెక్రటేరియట్‌ ఆదేశించిన విషయం తెలిసిందే. ఉన్నత విద్యా సంస్థలు, ఎయిమ్స్‌, మౌలిక సదుపాయాలు, పోలవరం ప్రాజెక్టు, రైల్వే జోన్‌, ప్రత్యేక హోదా, రాజధానిని హైదరాబాద్‌కు అనుసంధానం, కొత్త రాజధాని నిర్మాణానికి ఆర్థిక సాయం వంటి అనేక అంశాలను అజెండాలో పొందిపరిచింది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...