ఒడిశా ఘోర రైలు ప్రమాదంలో ఏపీ వాసి మృతి 

-

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో(Coromandel Train Accident) ఏపీ వాసి మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా జగన్నాథపురంకు చెందిన గురుమూర్తి మరణించాడని అధికారులు తెలిపారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో అంత్యక్రియలు పూర్తిచేశారు. అలాగే తీవ్రంగా గాయపడిన మరికొంతమంది ఏపీ ప్రయాణికులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే 141 మంది ప్రయాణికుల జాడ ఇంకా తెలియరాలేదు. వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తుండటంతో.. వారిని ట్రేస్ చేయడం కష్టంగా మారింది.

- Advertisement -

ప్రమాదం జరిగిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో(Coromandel Train Accident) 482 మంది ఏపీ ప్రయాణికులు ఉండగా.. ఇందులో 267 మంది క్షేమంగా బయటపడ్డారు. 113 మంది ఫోన్లలో అందుబాటులో లేకుండా పోయారు. విశాఖ నుంచి 76 మంది, రాజమండ్రి నుంచి 9 మంది, విజయవాడ నుంచి వెళ్లిన 28 మంది ప్రయాణికుల ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తున్నాయి. ఇక యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో 28 మంది ప్రయాణికుల ఆచూకీ లభించలేదు. రెండు రైళ్లలో కలిపి 316 మంది ఆంధ్రా వాసులు క్షేమంగా బయటపడగా.. 141 మంది జాడ మాత్రం లభ్యం కాలేదు.

Read Also:
1. మావోయిస్ట్ అగ్రనేత కటకం సుదర్శన్ మృతి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...