జగన్ బుజ్జగించినా మెత్తబడని బాలినేని.. అందుకే రాజీనామా చేశానని వివరణ

-

నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్​ పదవికి మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి(Balineni Srinivasa Reddy) రాజీనామా వ్యవహారం తాడేపల్లికి చేరింది. మంగళవారం క్యాంపు కార్యాలయంలో బాలినేనినితో సీఎం జగన్(Jagan) జరిపిన చర్చలు విఫలమైనట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఒంగోలు నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకే ప్రాంతీయ సమన్వయకర్త బాధ్యతల నుండి తప్పుకున్నట్లు బాలినేని చెప్పినట్లు సమాచారం. సీఎం జగన్ ఎంత సముదాయించినా ఆయన మెత్తబడలేదని వైసీపీ(YCP) వర్గాలు చెబుతున్నాయి. జగన్ తో భేటీ అనంతరం ఆయన మీడియా కంటపడకుండా వేరేదారిలో వెళ్లిపోవడంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లైంది. కాగా మంత్రివర్గ విస్తరణలో బంధువైన తనను పక్కనపెట్టి.. జిల్లాకే చెందిన ఆదిమూలపు సురేశ్(Audimulapu Suresh) ను కొనసాగించడం బాలినేని(Balineni Srinivasa Reddy)కి ఏమాత్రం నచ్చలేదు. దీంతో అప్పటి నుంచి ఆయన వైసీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు.

- Advertisement -
Read Also: ప్రజల దృష్టిని మరల్చడానికి వేసిన ప్లానే ఇది: టీడీపీ ఎంపీ

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...