YS Jagan Foreign Tour | విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ సీఎం జగన్నాం పల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై సీబీఐ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దని కోరారు. ఇప్పటికే జగన్‌పై 11 కేసులు విచారణ జరుగుతున్నాయని తెలిపారు. ఈ సమయంలో విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం సరైంది కాదని వాదించారు. దీంతో న్యాయస్థానం తీర్పును ఈనెల 14కు వాయిదా వేసింది. మరి కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
YS Jagan Foreign Tour | కాగా అక్రమాస్తుల కేసుల్లో జగన్ బెయిల్ షరతుల్లో భాగంగా విదేశాలకు వెళ్లాలంటే కచ్చితంగా కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. ఇదిలా ఉంటే సీఎంగా జగన్(YS Jagan) బాధ్యతలు చేపట్టిన తర్వాత నాలుగు సార్లు విదేశీ పర్యటనకు వెళ్లారు. తొలిసారి కుటుంబంతో కలిసి ఇజ్రాయెల్‌లోని జెరూసలెం పర్యటనకు వెళ్లారు. రెండో సారి కుమార్తె కాలేజీ జాయినింగ్ కోసం అమెరికా పర్యటనకు వెళ్లారు. మూడోసారి ఫ్యామిలీతో పాటు దావోస్ వెళ్లి అటు నుంచి విహారయాత్రకు వెళ్లారు. నాలుగోసారి లండన్ పర్యటనకు వెళ్లారు. ఆయన లండన్‌లో ఉన్నప్పుడే టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.