Chandrababu: బురఖాలు వేసుకున్న ముస్లిం మహిళలను సభలోకి రానివ్వరా?

-

Chandrababu fires on ap cm Jagan in Twitter: నరసాపురం సీఎం పర్యటనలో సోమవారం నిర్వహించిన సభ వద్ద పోలీసులు బురఖాలు వేసుకున్న ముస్లిం మహిళలను, నల్ల చున్నీలు ధరించిన యువతులు, మహిళలనూ అనుమతించలేదు. చున్నీలు తీసేసి వెళ్లాలని పోలీసులు వారికి చెప్పారు. ఈ ఘటన పై టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా మంగళవారం స్పందించారు. ‘‘ఇప్పటికే పరదాలు, బారికేడ్ల మధ్య పర్యటనలకు వెళుతున్న ముఖ్యమంత్రి… నల్లరంగులో ఉన్నాయని తన సభకు వచ్చిన మహిళల చున్నీలు కూడా తీయించివేయడం దారుణం. బురఖాలు వేసుకున్న ముస్లిం మహిళలను సభలోకి రానివ్వరా? గొడుగులు చూసి కూడా ఎందుకు భయం! ఇదంతా పోలీసు భద్రత కాదు… జగన్ రెడ్డి అభద్రత.’’ అని చంద్రబాబు ఓ ప్రముఖ పత్రికలో వచ్చిన వార్తను ట్విట్టర్‌‌లో పోస్ట్ చేశారు. కాగా తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి సీఎం జగన్ బయటకు రారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...