చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. స్కిల్ కేసులో బెయిల్ మంజూరు

-

టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)కు ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ దొరికింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఆయనకు పూర్తి స్థాయి బెయిల్‌ మంజూరు చేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ టి.మల్లికార్జున్‌రావు తీర్పు వెల్లడించారు. ఈ నెల 28న రాజమండ్రి జైలులో సరెండర్ కావాల్సిన అవసరం లేదని.. అయితే ఈ నెల 30 ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరుకావాలని ఆదేశించారు.

- Advertisement -

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు(Skill Development Case)లో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై ఈనెల 17న వాదనలు ముగిశాయి. చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్‌, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది. హైకోర్టు తీర్పుతో టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

మరోవైపు ఇప్పటికే స్కిల్ కేసులో చంద్రబాబు(Chandrababu) క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. గత నెలలో తీర్పును రిజర్వ్ చేయగా.. ఇటీవల జరిగిన విచారణలో దీపావళి సెలవుల అనంతరం తీర్పు ప్రకటిస్తామని ధర్మాసనం చెప్పింది. దీంతో రేపో, మపో తీర్పు రానుంది. కాగా ఈ కేసులో సెప్టెంబర్ 9వ తేదీన చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో 53రోజల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. గత నెల 31న హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

Read Also: లోకేష్ పాదయాత్ర పున:ప్రారంభానికి ముహుర్తం ఖరారు..!
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...