‘లియో’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచి అంటే..?

-

విజయ్ దళపతి(Vijay Thalapathy) హీరోగా ఇటీవల విడుదలైన ‘లియో(Leo)’ సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ అప్టేడ్ వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్(Netflix)లో నవంబర్ 24 నుంచి భారత్‌లో స్ట్రీమింగ్ అవ్వనుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కేవలం ఇండియాలో మాత్రమే స్ట్రీమింగ్ కానున్నట్లు సంస్థ ప్రకటించింది. మిగతా దేశాల్లో నవంబర్ 28 నుంచి అందుబాటులో ఉండనుందని తెలిపింది.

- Advertisement -

దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా(Leo) ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.600కోట్ల వసూళ్లు రాబట్టింది. తెలుగులో కూడా దాదాపు రూ.30 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఇక ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా, సంజయ్ దత్ విలన్‌గా, గౌతమ్ మీనన్, అర్జున్, మడోన్నా సెబాస్టియన్ ముఖ్య పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు. ఈ సినిమా కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్సిటీ(LCU)లో భాగంగానే తెరకెక్కింది.

Read Also: ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Google Wallet | ఆండ్రాయిడ్ యూజర్లు కోసం గూగుల్ వాలెట్ వచ్చేసింది

టెక్ దిగ్గజం google బుధవారం ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ వాలెట్(Google Wallet)...

Akshaya Tritiya | అక్షయ తృతీయ రోజు ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో తెలుసా?

వైశాఖ శుద్ధ తదియను "అక్షయ" తృతీయగా(Akshaya Tritiya) వ్యవహరిస్తారు. అక్షయం అంటే...