బీసీలకు 50 ఏళ్లకే నెలకు రూ.4వేల చొప్పున పింఛన్ ఇస్తామని టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రకటించారు. మంగళగిరిలో జరిగిన జయహో బీసీ కార్యక్రమంలో ఇరువురు నేతలు పాల్గొని బీసీ డిక్లరేషన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. మొత్తం 10 హామీలో ఈ డిక్లరేషన్(BC Declaration)ను రూపొందించారు.
BC Declaration లో అంశాలు ఇవే..
బీసీ కులాలకు 50 ఏళ్ల నుంచే పెన్షన్ అమలు.. నెలకు రూ.3 వేల నుంచి రూ.4వేలకు పెంపు
సబ్ ప్లాన్ కింద బీసీలకు ఐదేళ్లల్లో రూ.1.50లక్షల కోట్ల మేర కేటాయింపులు చేస్తాం
స్థానిక సంస్థల ఎన్నికల్లో 34శాతం రిజర్వేషన్లను పునరుద్దరిస్తాం
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లలే ఉండాలన్న నిబంధనను రద్దు చేస్తాం
బీసీల కోసం రూ.10లక్షలతో చంద్రన్న కానుక
పెళ్లి కానుక తిరిగి ప్రవేశపెడతాం.. లక్ష రూపాయలకు పెంపు
బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం
బీసీ పారిశ్రామికవేత్తల ప్రొత్సహానికి రూ.10 వేల కోట్ల కేటాయింపు
షరతుల్లేకుండా విదేశీ విద్యను అమలు చేస్తాం
పీజీ విద్యార్థులకు ఫీజు రీ-ఎంబర్సుమెంట్ పునరుద్దరిస్తాం
బీసీ భవనాలు, కమ్యూనిటీహాళ్ల నిర్మాణాలను ఏడాదిలో పూర్తి చేస్తాం
ప్రతేడాది కుల ధృవీకరణ తీసుకునే వ్యవస్థలను రద్దు చేస్తాం.. శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు ఇస్తాం