టీడీపీ ఎన్నారై నేత యశ్ బొద్దులూరి(Yash Bodduluri)ను సీఐడీ అధికారులు అక్రమంగా అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు(Chandrababu) మండిపడ్డారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. అనారోగ్యంతో ఉన్న తల్లి కోసం స్వదేశానికి వచ్చిన ఎన్ఆర్ఐ(NRI) యువకుడు అరెస్టు కోసం పోలీసులను ప్రత్యేకంగా పక్క రాష్ట్రానికి పంపించి అరెస్టు చేశారంటూ ఫైర్ అయ్యారు. అక్రమ అరెస్టులపై కాదు.. అంగన్‌వాడీల సమస్యలపై దృష్టిపెట్టాలని వైసీపీ ప్రభుత్వానికి సూచించారు.
2014 నాటికి రూ. 4,200 వేతనం పొందుతున్న అంగన్‌వాడీలకు తమ ప్రభుత్వ హయాంలో రూ. 6,300 పెంచి రూ.10,500 చేశామని తెలిపారు. న్యాయ బద్దమైన డిమాండ్లతో 11 రోజులుగా అంగన్‌వాడీలు సమ్మె చేస్తుంటే పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయకపోవడం వైసీపీ ప్రభుత్వం నిరంకుశత్వానికి నిదర్శనమని చంద్రబాబు(Chandrababu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Shocked to learn about the illegal arrest of NRI Yash Bodduluri at Hyderabad airport yesterday night on the basis of false cases filed against him in Andhra Pradesh. This draconian govt wants to stifle voices that question with arrests and detentions. I have learned that he was… pic.twitter.com/zrFCGlvM06
— Lokesh Nara (@naralokesh) December 23, 2023