TDP Mahanadu |ఏపీలో ఎన్నికలకు మరో పది నెలలు మాత్రమే ఉండడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ అందుకు తగ్గట్లు కార్యచరణతో ముందుకు వెళ్తోంది. ఓ వైపు యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రతో దూసుకెళ్తుండగా.. మరోవైపు అధినేత చంద్రబాబు ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంతో జనాల్లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే మే 27,28 తేదీల్లో మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు వేదికగా ఫేజ్ 1 మేనిఫెస్టోను చంద్రబాబు ప్రకటించారు. ఎన్నికల హమీల్లో భాగంగా ప్రజలపై వరాల జల్లు కురిపించారు. 2024లో అధికారంలోకి వస్తే.. అమలు చేయబోయే 6 ప్రధాన హామీలు ఇచ్చారు.
TDP Mahanadu ఆ వివరాలు..
1. పూర్ టు రిచ్.. పేదలను సంపన్నులను చేయడానికి తెలుగుదేశం కృషి చేస్తుందని చంద్రబాబు తెలిపారు. 5 ఏళ్లలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని.. అందుకు తగ్గట్టు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.
2. మహాశక్తి.. అధికారంలోకి వస్తే.. మహా శక్తి పథకం ద్వారా మహిళల అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీట వేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో ఉన్న 18 ఏళ్లు నిండిన మహిళలకు “స్త్రీనిధి” కింద నెలకు 1500 రూపాయలను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు.
** ‘తల్లికి వందనం’ కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే.. ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.15 వేలు అందిస్తామని ప్రకటించారు.
** ‘దీపం’ పథకం కింద.. ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామన్నారు. ** ఆర్టీసీ బస్సుల్లో మహిళలందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామంటూ మహిళలపై వరాల జల్లు కురిపించారు చంద్రబాబు.
3. బీసీల కోసం ప్రత్యేక చట్టం.. బీసీల రక్షణ కోసం చట్టం తెచ్చి.. వారికి అన్ని విధాలా అండగా నిలుస్తామని చంద్రబాబు మహానాడు వేదిక మీదుగా ప్రకటించారు.
4. ఇంటింటికీ నీరు.. అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇస్తామని చంద్రబాబు తెలిపారు.
5. యువగళం నిధి.. ప్రతి నిరుద్యోగికి ‘యువగళం నిధి’ కింద నెలకు 3000 రూపాయలను ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. 6. అన్నదాతకు అండగా.. అన్నదాత పథకం కింద ఏడాదికి 20వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని చంద్రబాబు వెల్లడించారు.
Read Also:
1. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కలిసిన షర్మిల
2. అంబటి రాయుడు ఐపీఎల్ రిటైర్మెంట్ వెనుక కారణం ఇదేనా?
Follow us on: Google News, Koo, Twitter