రాజమహేంద్రవరంలో తెలుగుదేశం పార్టీ మహానాడు(TDP Mahanadu) ఘనంగా ప్రారంభమయింది. వేమగిరిలో శనివారం ఉదయం అత్యంత వైభవంగా ఈ మహానాడు వేడుక ప్రారంభమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) వేదిక వద్దకు చేరుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు పూలమాల వేసి, నివాళి అర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేసి మహానాడును ప్రారంభించారు. మహానాడు వద్ద ఫొటో ఎగ్జిబిషన్ స్టాళ్లను సైతం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం చిత్తూరు జిల్లా కౌంటర్‌లో ప్రతినిధిగా చంద్రబాబు పేరు నమోదు చేసుకున్నారు.
మహానాడు మెుదటి రోజైన శనివారం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన 15 వేల మంది ప్రతినిధులు జిల్లాల వారీగా హాజరై రిజిస్టర్‌లో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు(Chandrababu) కీలక వ్యాఖ్యలు చేశారు. సంపద సృష్టిస్తాం.. పేదలకు పంచుతాం అని తెలిపారు. ప్రతీ పేదవాడు ధనికుడిగా మారాలి అన్నదే తన లక్ష్యమని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. క్రీస్తు శకం మాదిరిగా తెలుగు జాతికి ఎన్టీఆర్ శకం కూడా ప్రారంభం అవుతుంది అని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ మెచ్చిన నగరం రాజమహేంద్రవరం(Rajamahendravaram) అని చంద్రబాబు అన్నారు. తెలుగు జాతియెుక్క సాంస్కృతి, సంప్రదాయాల వైభవం రాజమహేంద్రవరం అని కొనియాడారు. రాజమండ్రిని రాజమహేంద్రవరంగా నామకరణం చేసిన పార్టీ టీడీపీ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు.
Read Also:
1. అన్ని కోట్ల ఆస్తులు ఎక్కడివి? చెప్పే దమ్ముందా? జగన్‌కు అచ్చెన్న సవాల్
2. కోజీకోడ్‌లో దారుణం.. కాల్వలో యువకుడి శరీర భాగాలు
Follow us on: Google News, Koo, Twitter